తెలంగాణ

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: నిత్యం ట్రాఫిక్ జాం...బస్సుల కోసం నిరీక్షణ వంటి సమస్యలతో సతమతమవుతున్న నగరవాసులకు మరో పది కిలోమీటర్ల మెట్రోరైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. 20వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్ నరసింహన్ జెండా ఊపి మెట్రోరైలును ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎలాంటి ఆర్భాటం, ప్రచార హడావుడి లేకుండా సింపుల్‌గా ప్రజలకు ఈ కారిడార్‌లో మెట్రోప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రోరైలు భావించినా, 20వ తేదీ బుధవారం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది
56 కిలోమీటర్లకు పెరగనున్న మెట్రో పరుగు
ఇప్పటికే కారిడార్ నెంబర్ వనలోని ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు సుమారు 29 కిలోమీటర్లు, కారిడార్ నెంబర్ 3లోని నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు దాదాపు 17 కిలోమీటర్ల పొడువున మొత్తం 46 కిలోమీటర్ల మెట్రోప్రయాణం నగరవాసులకు అందుబాటులో ఉండగా, ఇపుడు అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు పది కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి వస్తుండటంతో ఇకపై నగరంలో మెట్రో 56 కిలోమీటర్ల పొడువున పరుగులు తీయనుంది. మొట్టమొదటి సారిగా నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా మియాపూర్ వరకు, ఆ తర్వాత కొద్దిరోజులకే అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ఇపుడు అమీర్‌పేట-హైటెక్‌సిటీల మధ్య అందుబాటులోకి వస్తుండటంతో మొదటి విడత మెట్రో ప్రాజెక్టులో ప్రతిపాదించిన కారిడార్-1, కారిడార్-3లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇందులోనే కారిడార్-2గా సికిందరాబాద్ జేబీఎస్ నుంచి పాతబస్తీ ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన కారిడార్‌లో పనులు మెల్లిగా సాగటం, స్థల సేకరణకు ఆలస్యం కావటం, సుల్తాన్‌బజార్‌లో స్థల సేకరణ గతంలో వివాదాస్పదంగా మారటం వంటి కారణాలతో ఈ కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతున్నా యి. జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు కారిడార్‌ను ప్రతిపాదించినా, మరి కొద్ది నెలల్లో జీబీఎస్ నుంచి గౌలీగూడ సీబీఎస్ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ము మ్మరమయ్యాయి.