తెలంగాణ

కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 18: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని మరోమారు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మేడ్చల్ పట్టణంలోని ఎన్‌జేఆర్ - కేఎల్‌ఆర్ నగర్‌లో సోమవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పుల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం కల్పించాలని తానే అధిష్టానానికి సూచించానని, కాని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనించి ప్రజల సమస్యలపై పోరాడేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు తాను మల్కాజిగిరి బరిలో నిలిచానని వివరించారు. తాను మొ దట సోదరి సబిత ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించినప్పు డు తనకు కార్తీక్ అయినా నువ్వైనా ఒక్కటేనని నిన్ను గెలిపించుకుంటామని నమ్మబలికి నేడు బజారులో అమ్ముడుపోయి కేసీఆర్ కుట్రలకు సహకరిస్తున్నారని ఆరోపించా రు. పదేళ్ల పాటు కాంగ్రెస్‌లో అధికారం అనుభవించి కార్యకర్తల కష్టంతో గెలిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎల్‌బీ నగర్ సుధీర్‌రెడ్డి గెలుపు కోసం తాను తన నియోజకవర్గంలో కూడా ప్రచారం వదిలిపెట్టి ఇక్కడ ప్రచారం చేశానని గుర్తుచేశారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే చట్టసభల్లో మాట్లాడే అవసరం లేదన్నారు. సభలో కేసీఆర్‌కు జీ హుజూర్ అంటూ వంగి ఉండాలని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. మోదీతో దేశానికి ప్రమాదముందని నోట్ల రద్దు, జీఎస్టీలతో మోదీ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. మల్కాజిగిరి మినీ భారతదేశమని దేశానికి ఆదర్శంగా నిలిచే మల్కాజిగిరిలో ఎవరు గెలవాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయని కేసీఆర్ ఢిల్లీలో ఎలా చక్రం తిప్పుతారని ప్రశ్నించారు. చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా కదన రంగంలో దూకాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి పిండం పెట్టి రెండు రోజుల తర్వాత మరిచిపోయినట్లుగా పార్టీ మారిన వారిని కూడా అలాగే మరిచిపోవాలని అన్నారు. బూత్‌స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుని రేవంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ అన్నారు. సమావేశంలో కూన మాట్లాడుతూ రేవంత్ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ప్రశ్నించేవారు లేకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, పార్టీలు మారిన వారు తారసపడితే నిలదీయాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దమర్రి నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ్ధర్, కేఎల్‌ఆర్, జిల్లా అధ్యక్షురాలు దుర్గమ్మ పాల్గొన్నారు. నేడు ఎల్‌బీ నగర్, రేపు మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కూన తెలిపారు.