తెలంగాణ

115 లక్షల ఎకరాల్లో సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో 2016-17 సంవత్సరంలో 112 లక్షల ఎకరాల్లో (45.49 లక్షల హెక్టార్లు) పంటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2016-17 సంవత్సరం వ్యవసాయ ప్రణాళికను సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్‌లో పత్తిపంట విస్తీర్ణాన్ని తగ్గించేందుకు నిర్ణయించి, కందులు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. 6.14 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 5.02 లక్షల హెక్టార్లలో సోయాబీన్, 4.85 లక్షల హెక్టార్లలో కందులు వేయాలని నిర్ణయించామన్నారు. పత్తి పంట విస్తీర్ణాన్ని 10.64 లక్షల హెక్టార్లకు తగ్గించాలని నిర్ణయించారు. రైతుల అవసరాల మేరకు ఖరీఫ్‌లో 5.69 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని, రబీలో 2.80 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందించాలని నిర్ణయించామని పోచారం తెలిపారు. రాష్ట్రంలో 10 విత్తన గోదాములు-ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నామన్నారు..
రైతుల అవసరాలకోసం ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నుల ఎరువులను, రబీలో 12.25 లక్షల టన్నుల ఎరువులను అందిస్తామన్నారు. మార్క్‌ఫెడ్ సంస్థను నోడల్ ఏజన్సీగా గుర్తించామన్నారు. 2016-17 సంవత్సరంలో ఐదులక్షల మట్టి నమూనా కార్డులను (సాయిల్ హెల్త్ కార్డులు) ఇస్తామని మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలను అందించేందుకు 419.85 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గత ఏడాది పంటలకు జరిగిన నష్టానికి సంబంధించి 21.78 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా 989.587 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాగానే ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తామన్నారు.
2016-17 సంవత్సరంలో పంటరుణాలుగా 29,101 కోట్ల రూపాయలను, టర్మ్‌లోన్స్‌గా 11,911 కోట్ల ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. పంటలకు బీమా వర్తింప చేసేందుకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం డబ్బును రైతుల చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి ఫజల్ బీమాయోజన కింద 169.21 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరిస్తోందన్నారు. రాష్ట్రంలో 311 మంది ఎఇఓలను, 120 మంది ఎఓలను నియమించేందుకు అనుమతించామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.