తెలంగాణ

యూఎస్ వర్శిటీలతో ఇఫ్లూ అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: ఆంగ్లం - విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) అనేక విద్యాత్మక అంశాల్లో యూఎస్ వర్శిటీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన 14 మందితో కూడిన ప్రతినిధి బృందం సభ్యులు వర్శిటీని సందర్శించారు. భారతదేశంలో ఉన్నత విద్యా విధానం , ఇఫ్లూ పనితీరుపై వారు వర్శిటీ అధికారులతో చర్చించారు. రిజిస్ట్రార్ , అకడమిక్ డీన్స్ , వివిధ శాఖల అధిపతులు, అంతర్జాతీయ వ్యవహారాల డీన్ వర్శిటీ గురించి యూఎస్ బృందానికి వివరించారు. యూనివర్శిటీలో నిర్వహిస్తున్న వివిధ భాషల అధ్యయనం గురించి కూడా వారు చెప్పారు. ఇఫ్లూలో ఈఎంఎంఆర్‌సీ పాత్రను వారికి చెప్పారు. ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్, కరిక్యులమ్ రూపకల్పన, విద్యార్థుల ఎక్స్‌చేంజ్ తదితర విషయాలపై ఇరు బృందాలు చర్చించాయి. భవిష్యత్‌లో ఇఫ్లూతో కలిసి పనిచేస్తామని యూఎస్ సభ్యులు పేర్కొన్నారు.