తెలంగాణ

డీపీఓల బదిలీల్లో స్వల్ప మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయి ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న డీపీఓ అభ్యర్థులకు ఇటీవలే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ పోస్టింగ్‌లలో స్వల్పమార్పులు చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో మంగళవారం జీఓ జారీ అయింది. జగిత్యాలలో పనిచేసేందుకు డాక్టర్ పి. జయసుధకు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ, ఆమెను నిజామాబాద్ డీపీఓగా నియమించారు. జోగులాంబ గద్వాల జిల్లా డీపీఓగా నియామకం అయిన ఎం. రఘువర్‌ను కరీంనగర్ డీపీఓగా నియమించారు. జోగులాంబ గద్వాలలో ప్రస్తుతం పనిచేస్తున్న పి. కృష్ణ బదిలీని రద్దు చేసి ఆయనను అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.