తెలంగాణ

రాష్ట్రాన్ని ఉద్ధరించలేని వారు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రాష్ట్రాన్ని ఉద్ధరించలేని వారు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగరరావు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం నుండి వచ్చిన వాళ్లు అందరూ పామరులేనని ఎద్దేవా చేశారు, కానీ వారికి అఆలు కూడా రావని అన్నారు. బీజేపీ నేతలే కాదని, దేశంలో ఉన్న వారంతా కాపాలాదారులేనని వ్యాఖ్యానించారు. ప్రియాంకా గాంధీకి రాజ్యాంగం గురించి కూడా తెలియనట్టుందని అన్నారు. ప్రియాంక , రాహుల్‌గాంధీలు రాజ్యాంగంలోని 42వ సవరణను చదువుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రిని ఇష్టానుసారం మాట్లాడి ముఖ్యమంత్రి పదవికే అవమానం చేశారని అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే సీఎం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. చిత్తశుద్ధి లేని శివపూజలేల అని కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరించలేని వాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ఏమీ సాధించలేని నేత దేశం గురించి మాట్లాడుతున్నారని , రిటర్న్ గిఫ్టు ఇస్తా అంటూ రిటర్నయ్యారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రాలో తమ ప్రమేయం ఏమీ లేదని ఒప్పుకున్నారని టీఆర్‌ఎస్ పేరును తండ్రీ కొడుకుల పార్టీగా మార్చుకోవాలని సూచించారు. అభ్యర్ధిని కాకుండా తన తండ్రి ముఖం చూసి ఓటు వేయాలని ప్రజాస్వామ్యంలో ఉంటుందా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే ఎన్నికల్లో అభ్యర్ధుల పేర్లు, ఫోటోలు పెట్టొద్దని చెబుతారామోనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇకనైనా మేలుకోవాలని ఆయన సూచించారు.