తెలంగాణ

దేవేందర్ గౌడ్‌తో కొండా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి బుధవారం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి టీ. దేవేందర్ గౌడ్‌ను కలిసి మద్దతు కోరారు. కొండా విశే్వశ్వర్ రెడ్డి చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా విశే్వశ్వర్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. అనంతరం కొండా విలేఖరులతో మాట్లాడుతూ గౌడ్ కుటుంబం చూపించిన ఆదరాభిమానాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేవేందర్ గౌడ్ తనకు మద్దతునిస్తానని చెప్పారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ
ఇలాఉండగా బుధవారం సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ భేటీ జరిగింది. సమావేశానంతరం సీఎల్‌పి నేత భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, న్యాయ, ఎన్నికల సంఘం ముఖ్యమైన ప్రభుత్వ యంత్రాంగంతో సమాచార సేకరణ, ఎన్నికల అంశాలకు సంబంధించి కమిటీ సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఏఐసీసీ నుంచి వచ్చే సమాచారాన్ని నిరంతరం సేకరించి అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందిస్తుందని ఆయన తెలిపారు.