తెలంగాణ

బీసీ స్టడీసర్కిల్‌లో ప్రవేశానికి 21న ఎంపిక పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్) ద్వారా పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్-3 ఎంపిక పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఈ ప్రత్యేక శిక్షణ తరగతుల్లో చేరేందుకు బీసీ స్టడీసర్కిల్ ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశపరీక్ష ఈ నెల 21న జరుగుతుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి తెలిపారు. సైదాబాద్ , లక్ష్మీనగర్ కాలనీల్లోని తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ జరుగుతుందని , దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్‌బీసీ స్టడీసర్కిల్స్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు.
ఓపెన్ వర్శిటీ దరఖాస్తు గడువు 28
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేరుగా డిగ్రీ చదువుకోవాలనే వారి కోసం అర్హతపరీక్ష దరఖాస్తు గడువును మార్చి 28 వరకూ పొడిగించినట్టు వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ లేదా తత్సమాన అర్హత లేని అభ్యర్ధులు డిగ్రీలో ప్రవేశం పొందాలంటే ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని, వారి వయస్సు జూలై 1 నాటికి 18 ఏళ్లు ఉండాలని వర్శిటీ పేర్కొంది.
అధిక ఫీజులపై చర్యలు: ఏఐఎస్‌ఎఫ్
తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరం పూర్తికాకముందే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డొనేషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారం అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ నేతలు గ్యార నరేష్, మసరం ప్రేమ్‌కుమార్, సత్య, ఇస్మాయిల్ తదితరులు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధనరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.