తెలంగాణ

నియమావళి ప్రకారం నడుచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) తుది నిర్ణయాలనీ, అవే శిరోధార్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులతో పాటు, మెట్రోరైల్ కొత్తలైన్ ప్రారంభించడం, జూనియర్ పంచాయతీ అధికారుల నియామకం తదితర అంశాలపై వస్తున్న ఫిర్యాదులను ఈసీఐకి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బుధవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపి తదితర పార్టీల తరఫున ప్రతినిధులు ఎవరూ రాలేదన్నారు. బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, టీపీసీసీ, టీడీపీ పార్టీల తరఫున ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ప్రార్థనా మందిరాలను ప్రచారం కోసం వాడవద్దని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. మతపరంగా ఏ వర్గాన్ని కూడా డబ్బు రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ ప్రేరేపించవద్దని సూచించామన్నారు. బుధవారం వరకు గత మూడు రోజుల్లో మొత్తం 58 నామినేషన్లు వచ్చాయని, కేవలం బుధవారమే 42 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీలో సోషల్ మీడియా నిపుణుడు మాధవాచారిని ఒక సభ్యుడిగా నియమించామని రజత్‌కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో లోక్‌సభ అభ్యర్థుల తరఫున ఎలాంటి ప్రకటనలు జారీ అయినప్పటికీ ఎన్నికల లెక్కల్లోకి వస్తాయన్నారు. ఇప్పటి వరకు ఎంసీఎంసీ నియమావళిని ఉల్లంఘించిన సోషల్ మీడియాకు సంబంధించి 53 కేసులను గుర్తించామని, వారికి నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10 నుండి ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 11.29 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. సీ-విజిల్‌కు మంచి స్పందన వస్తోందని, 328 ఫిర్యాదులు ఇప్పటి వరకురాగా 325 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. కేవలం మూడు కేసులను మాత్రమే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో ప్లాస్టిక్‌ను ఏ రూపంలోనూ వినియోగించవద్దని రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ అంశంపై శ్రద్ద చూపించాలని, ప్లాస్టిక్‌ను వాడవద్దని సూచించారు. కాగితం లాంటి బయో-డీగ్రేడబుల్ వస్తువులను వాడవచ్చన్నారు. ప్రచారం చేసే అభ్యర్థులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్లు వాడవచ్చని, రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిషేధించామన్నారు. హెలికాప్టర్ వినియోగంలో అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత ఎన్నికల సమయంలో 127 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకోగా, 29 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చివేశామని, మిగతా డబ్బు ఆదాయ పన్ను శాఖ అధీనంలోనే ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ నెల 22 న పోలింగ్ ఉందని గుర్తు చేశారు.