తెలంగాణ

ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తన ప్రభుత్వ సలహాదారు పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసి, తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇస్తానన్న హామీ ఇవ్వడం వల్లనే తిరిగి పార్టీలోకి వచ్చినట్టు తన లేఖలో వివేక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చురుకైన పాత్ర పోషించడంతో ప్రతిఫలంగా తనకు ప్రభు త్వ సలహాదారు పదవి ఇచ్చారని వివేక్ గుర్తు చేశారు. తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితో పెద్దపల్లి ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చానన్నారు. అయినప్పటికీ తనకు ఎంపీ టికెట్ నిరాకరించడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు పదవి కాలంలో ప్రభుత్వం నుంచి నయా పైసా తీసుకోలేదని కూడా ఆయన తన లేఖలో గుర్తు చేశారు. ఇలా ఉండగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి తన సన్నిహితులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో వివేక్ శనివారం సమావేశం కానున్నారని తెలిసింది.