తెలంగాణ

సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు చాలా మంది శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారంతో గడువు ముగియనుంది. అంతకు ముందు రోజు, ఆదివారం సెలవు దినం కావడంతో దాఖలు చేయడానికి ఇక మిగిలింది శని, సోమ రెండు రోజులు మాత్రమే. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపించడం, శుక్రవారం మంచి ముహుర్తం ఉంద న్న అనుమానంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమతమ నామినేషన్లకు శుక్రవారానే్న ఎంచుకున్నారు. దీంతో 17 పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల కోలాహలంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీ అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి పి రాములు, కాంగ్రెస్ అభ్యర్థులు చేవెళ్లలో ఎంపీ విశే్వశ్వర్‌రెడ్డి (సిట్టింగ్), మల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) తదితర ముఖ్యులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతుంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. బి-్ఫమ్‌లు అందుకున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి చేసి ప్రచారానికి బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నారు. అంతకుముందు తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపికైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ శుక్రవారం ఉదయం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటికి కూడా వెళ్లి మద్దతును కోరారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నుంచి బి-్ఫమ్‌ను అందుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవడమే కాకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో భారీ మెజారిటీ సాధించడానికి ప్రతి ఎమ్మెల్యే ప్రతిష్ఠాకరంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే మెజారిటీని దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. మొత్తం మీద నామినేషన్ల దాఖలుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాలకు తరలివెళ్లడంతో రాష్టవ్య్రాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తన నామినేషన్ దాఖలుకు ముందు మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య కూడా చేరుకున్నారు. అనంతరం వారంతా నామినేషన్ దాఖలుకు వెళ్లారు. మహబూబ్‌నగర్‌లో మనె్న శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆ జిల్లాకు చెందిన మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, దేవరకద్రా ఎమ్మెల్యే ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భువనగిరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి నర్సయ్య గౌడ్ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.