తెలంగాణ

అవినీతిపరులకు ప్రధాని మోదీ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 22: దేశ ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు కోసం, బీజేపీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు సాధిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కుంభకోణాలు, అవినీతి ఊసు లేకుండా మోదీ సాగించిన ఐదేళ్ల పాలనతో దేశం ఆర్థికంగా బలోపేతమవ్వడంతో విదేశాల్లో దేశ ప్రతిష్ట పెరిగిందని అభిప్రాయపడ్డారు. రక్షణ రంగంలో భారత దేశం శతృదుర్బేధ్యంగా మారిందన్నారు. రహదారులు, సంక్షేమ పథకాలు, పారిశుద్ధ్యం వంటి రంగాల్లో పురోభివృద్ధి సాధించిందన్నారు. దేశ ప్రజలు మోదీ పట్ల ఆదరణ చూపుతుంటే అవినీతి పరులకు మోదీ భయం పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దేశాన్ని పాలించే ప్రధానిని, పార్టీని ఎన్నికునే లక్ష్యంతో సాగుతాయని సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు, పార్టీ నాయకులకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా పారిశ్రామిక వేత్తలకు, రియల్ వ్యాపారులకు టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లీస్‌కు, ఓవైసీకి ఓట్లు వేసినట్లేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయిందన్నారు. డీకే అరుణ వంటి నాయకులు మరికొందరు బీజేపీలో చేరబోతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంఛలన విజయాలు నమోదు చేయబోతుందన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం రానున్నందునా రాష్ట్రంలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు పొందడం సాధ్యమవుతుందన్నారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రజలు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అభ్యర్థులు గార్లపాటి జితేందర్‌కుమార్, పీవీ శ్యాం సుందర్‌లను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి జితేందర్‌కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు బాకి పాపయ్య, వీరేల్లి చంద్రశేఖర్, రామోజీ షణ్ముక, సాంబయ్య, మునికుమార్ పాల్గొన్నారు.