తెలంగాణ

కొండల రాయుడి కోనేటి వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 22: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్రవారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. లోకకల్యాణార్థం, ఏటా సనాతన సాంప్రదాయ పద్ధతిలో, తరతరాల వారసత్వ ఆచార అనుసరణలో భాగంగా కల్యాణాది ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించిన అనంతరం శ్రీవేంకట నాథుడు తన దేవేరితోకూడి, విశేష పౌరాణిక ప్రాధాన్యతను సంతరించుకున్న బ్రహ్మపుష్కరిణికి వ్యాహ్యాళి (విహారానికి) వెళ్ళడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈనేపథ్యంలో సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాలయుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారంగుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనులగావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగానగల భోగమంటపంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఇరుకున మార్గంగుండా భోగమంటపానికి క్యూలైన్లద్వారా వెళ్ళి రూపాయల దండలు వేసి, కట్నకానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, శ్రీ్ధరాచార్య, విజయ్, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఇఓ అమరేందర్, ధర్మకర్తలు, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు. రాత్రి వరకూ కొనసాగిన ఈకార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయాలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.