తెలంగాణ

రైతును ఏకగ్రీవంగా ఎన్నుకుందామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 23: ఆరుగాలం శ్రమించే రైతును నిజామాబాద్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఏకగ్రీవం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు ఎంక్ప కవిత కూడా సిద్ధమేనా..? అని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రంలోని మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తొలిసారిగా శనివారం నిజామాబాద్‌కు హాజరైన మధుయాష్కీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ భవన్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఎంపీగా రైతును ఏకగ్రీవం చేసి పార్లమెంట్‌కు పంపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనిపై కవిత కూడా తన వైఖరిని వెల్లడించాలన్నారు. రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తుంటే, రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు.