తెలంగాణ

ఆర్టీసీ ప్రయాణికుడి ఫిర్యాదుతో సిబ్బందిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ప్రయాణం కోసం టికెట్ రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ సకాలం అక్కడికి బస్సు రాకపోవడంతో విసుగుపోయిన ప్రయాణికుడు నేరుగా రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఫోన్ చేసి తనకు జరిగిన అసౌకర్యాన్ని మంత్రి దృష్టికి తీసుకుచ్చారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్టీసీ సిబ్బందిపై సస్పెన్సన్ వేటు వేయాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఆగమేఘాలపై సంబంధిత అధికారులపై సస్పెన్సన్ వేటు వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య తన కుమారుడు అరవింద్ అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో శంషాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే బస్సు ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉంది. కానీ బస్సు రాకపోవడంతో రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తనకు జరిగిన అసౌకర్యాన్ని వివరించారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ తక్షణం ప్రయాణీకుడు వద్దకు బస్సు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. శంషాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్ళాల్సిన బస్సు ఎందుకు వెళ్లలేదో తనకు వివరాలు చెప్పాలని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు.