తెలంగాణ

కేసీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 24: దేశ రాజకీయాలను పరిశీలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదని.. రాజకీయ చతురుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా అనుమాన పడాల్సిన అవసరమే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ సాధిస్తాడా? అని కేసీఆర్‌ను చాలామంది ఎద్దేవా చేశారని, కాని ఆ రెండు స్థానాలతోనే రాజకీయం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మగాడు.. మొనగాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రెండు స్థానాలతోనే రాజకీయం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మగాడు.. మొనగాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రెండు స్థానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ చేతికి రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే దేశ రాజకీయాల్లో కీలకనేతగా ఎదుగుతాడని మంత్రి దయాకర్‌రావు అన్నారు. కేసీఆర్‌కు మద్దతు తెలపడానికి సుమారు వందమంది ఎంపీల బలం సిద్ధంగా ఉందని మన రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేస్తే తెలంగాణ రాష్టస్రమితికి దేశంలో తిరుగే ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అది లేవలేని ముసలిపార్టీ అని.. లేపాలని ప్రయత్నించినా లాభం ఉండదన్నారు. డికే అరుణ, రాపోలు ఆనంద్‌భాస్కర్ వంటి కరుడుగట్టిన కాంగ్రెస వాదులే ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నారని, ఎంపీ టికెట్‌లు ఇస్తామన్నా వద్దంటూ అనేకమంది నాయకులు తప్పించుకుంటున్నారని తెలిపారు. దాన్నిబట్టే కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని దయాకర్‌రావు తెలిపారు. 16స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నారు. నియోజకవర్గాల మద్య మెజార్టీ కోసం పోటీ జరుగుతుందని మానుకోట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాదించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ విజయాన్ని కానుకగా అందించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని అందుకే కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటు అడగాలని కోరారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారిని ఓటు అడిగితే కచ్చితంగా వేస్తారని, గడపగడపకు తిరిగి సంక్షేమ పథకాలు వివరించి ఓటు అడితే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు. రైతుబంధు పథకం ఒక అద్భుతమైన పథకం అని ప్రపంచ స్థాయిలోనే ఈ పథకానికి ప్రశంసలు అందుతున్నాయన్నారు. మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందుతుందని కాలేశ్వరం పనులు పూర్తి అయితే మరికొన్ని నెలల్లోనే మహబూబాబాద్‌జిల్లాలోని ప్రతి చెరువు సంవత్సరం అంతా నీటితో కళకలలాడుతుంనది ఎర్రబెల్లి అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మాలోతు కవితను 4లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిపించాలని, భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామాలను, మండలాలను తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సమయం తక్కువగా ఉందని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని దయాకర్‌రావు కోరారు. మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎంపీ అభ్యిర్ధి మాలోతు కవిత, పార్టీ నాయకులు బీరవల్లి భరత్‌కుమార్‌రెడ్డి, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, కెఎస్‌ఎన్ రెడ్డి, మర్రి రంగారావు, డాక్టర్ నెహ్రునాయక్, కాశీం, ఫరీద్, ముత్యం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు