తెలంగాణ

ఎవరి దారి వారిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో మార్చి 30వ తేదీ నుండి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ప్రకటించి, వేసవిలో ఎలాంటి క్లాసులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ ప్రకటించినా, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు వాటి పని అవి చేసుకుంటున్నాయి. బహిరంగంగానే క్లాసుల నిర్వహణకు సంబంధించి ప్రకటనలు ఇస్తున్నాయి. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేసుకుంటూ ఫస్టియర్ క్లాసులను ప్రారంభిస్తున్నా ఇంటర్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కళ్లముందే అన్నీ జరుగుతున్నా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు మాత్రం కళ్లుమూసుకుని ఆమోదాన్ని ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలతో అధికారులు మిలాఖత్ కావడం వల్లనే వేసవి సెలవుల్లో కాలేజీలను నిర్వహిసున్నా వౌనంగా ఉంటున్నారని ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు పతాకస్థాయికి చేరుకుంటున్నా కార్పొరేట్ కాలేజీలు మాత్రం బలవంతంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని కాలేజీలు మాత్రం తాము కేవలం జేఈఈ, ఎమ్సెట్‌లకు శిక్షణ ఇస్తున్నామని తప్పించుకుంటుండగా, మరికొన్ని కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా క్లాసులు నిర్వహిస్తూనే ఏమీ జరగడం లేదని చెబుతున్నాయి. మాదాపూర్, అమీర్‌పేట, నాగోల్, ఉప్పల్, ఫిర్జాదీగూడ, ఈసీఐఎల్, కూకట్‌పల్లి, నిజాంపేటల్లో దాదాపు రెండు వందల కాలేజీలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతా తెలిసినా బోర్డు అధికారులు మాత్రం క్లాసులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని పేర్కొంటూ ఒక ప్రకటన జారీ చేతులు దులుపుకున్నారు. ఇంకో పక్క ఇంటర్ అడ్మిషన్లను కూడా ప్రైవేటు కాలేజీలు పూర్తి చేశాయి. చాలా కాలేజీల్లో అపుడే నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నాయి. బలవంతం చేస్తే ఫీజు ఎక్కువ అవుతుందని ప్రైవేటు కాలేజీలు దండుకుంటున్నాయి. సమీపంలో పేరొందిన ప్రైవేటు కాలేజీల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు వారు అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులపై గత ఏడాది పెద్ద ఎత్తున రగడ జరిగినా ఈ ఏడాది ఇంత వరకూ బోర్డు అధికారులు నోరు మెదపడం లేదు. కనీసం ఫీజులకు సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీ చేయలేదు.