తెలంగాణ

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ. 530 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 530 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బిసీలు, ఇబిసిలకు కూడా వర్తింప చేయడంతో దీనికి రూ. 738 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకాన్ని బిసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పెండ్లికి ముందే ఆడపిల్లల చేతికి చెక్కు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో పేదింటి ఆడపిల్ల పెండ్లి జరిగే కుటుంబంలో ఆనందం నింపాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకాలను తెలంగాణలో మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 44,351 మంది ఎస్సీ అమ్మాయిలకు, 25,793 మంది ఎస్టీ అమ్మాయిలకు, 33,913 మంది మైనార్టీ అమ్మాయిలకు మొత్తంగా 1,04,057 మందికి రూ. 51 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందు కోసం ఇప్పటి వరకు రూ. 530 కోట్లు ఖర్చు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని బిసీలు, ఇబిసిలకు కూడా వర్తింప చేయడంతో దీని కోసం 2016-17 సంవత్సరానికిగాను రూ. 738 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. దీంట్లో మైనార్టీలకు రూ. 150 కోట్లు, ఎస్సీలకు రూ. 200 కోట్లు, ఎస్టీలకు రూ. 88 కోట్లు, బిసీలకు రూ. 300 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం పేదింటి ఆడపిల్లల పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా బాల్య వివాహాలను నియంత్రించే సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు.