తెలంగాణ

మాటలు ఘనం.. చేతలు శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 18: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెండేళ్ల పాలనలో మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సి.పి.ఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వీరభద్రం శనివారం విలేకరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన, తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై పార్టీ కేంద్రకమిటీ సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర కమిటీకి నివేదిక సమర్పించినట్లు ఆయన చెప్పారు. చంద్రశేఖరరావు చెబుతున్న బంగారు తెలంగాణా సాధన గురించి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయకుండా బంగారు తెలంగాణాను ఎలా సాధిస్తారని వీరభద్రం ప్రశ్నించారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణా సాధ్యమవుతుందనేది టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రహించాలని ఆయన సూచించారు. కార్పోరేట్లకు కాంట్రాక్టులు ఇవ్వటం, కుటుం బ రాజకీయాలను సుస్థిరం చేసుకోవటం, కాంట్రాక్టుల ఆశపెట్టి ఇతర పార్టీల వారిని ఆకర్శించటం మంచిదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే లక్ష్యంతోనే చంద్రశేఖర రావు పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రశేఖరరావు అభివృద్ది నమునా కార్పోరేట్లకు ఊడిగం చేసేదిగా ఉన్నదని వీరభద్రం ఎద్దేవ చేశారు.