తెలంగాణ

కొత్త ప్రాజెక్టులు.. కోటి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా నిర్మించబోయే పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను, గోదావరిపై నిర్మించబోయే తుమ్మిడిహట్టి, ప్రాణహిత-కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టుల ప్రస్తుతం డిజైన్‌వల్ల అనేక సమస్యలు, అంతరాష్ట్ర వివాదాలు ఉండడటంతో వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది.

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ 2016 సంవత్సరంతానికల్లా పూర్తి చేయడంతో పాటు పాలమూర్-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకోసం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇక గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టుల ప్రస్తుతం డిజైన్‌వల్ల అనేక సమస్యలు, అంతరాష్ట్ర వివాదాలు ఉండడటంతో వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. అలాగే గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రస్తుత ప్రాజెక్టుల డిజైన్ వల్ల ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గోదావరిపై ప్రతిపాదిత ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేసే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే వ్యాప్కోస్ ఆదిలాబాద్‌లో నిర్మించబోయే తుమ్మిడిహట్టి, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించబోయే భారీ ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేసి ప్రభుత్వానికి సమర్పించింది. వీటిని ఆమోదించి కేంద్ర ప్రభుత్వ అనుమతులకు పంపించడానికి కసరత్తు చేస్తోంది. రీ-డిజైన్ల వల్ల గతంలో ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సానుకూలంగా పరిష్కారం అయ్యే వాతావరణం నెలకొనడంతో జనవరి నుంచి కొత్త ప్రాజెక్టుల పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్రం 953 టిఎంసిల నీటిని వినియోగించుకునే హక్కు కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల వల్ల ఇందులో 433 టిఎంసిల నీటిని రాష్ట్రం వినియోగించుకుంటుంది. ఇంకా మిగిలిన 521 టిఎంసిల నీటిని వినియోగించుకోవాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 400 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు ప్రతిపాదిత ప్రాజెక్టులకు దాదాపు కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. మొదటి దశలో అనుమతులు, వివాదాలు లేని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు, కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మించి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కొంత భాగానికి సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ నిర్మించబోయే ప్రాజెక్టును నిజాంసాగర్‌కు, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కంతనపల్లి ప్రాజెక్టును నిర్మించే దిశగా డిజైన్ చేస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉత్తర తెలంగాణలోని 54 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 4 నియోజకవర్గాలు అర్బన్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా 50 నియోజక వర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా నిర్మించబోయే పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను, గోదావరిపై నిర్మించబోయే తుమ్మిడిహట్టి, ప్రాణహిత-కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

-వెల్జాల చంద్రశేఖర్