తెలంగాణ

‘పరిషత్’లో బలమైన పార్టీగా అవతరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో టీర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా అవతరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. బుధవారం ఇక్కడ జిల్లా పదాధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందని , టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ క్షేత్రస్థాయి పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేస్తమన్నారు. రాష్ట్రంలో బీజేపీయే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే స్థితిలో లేదన్నారు. ఈ రోజు కేసీఆర్ సర్కార్ పూర్తిగా అయోమయంలో ఉందన్నారు. అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పాలనను గాలికి వదిలేసి, ఎన్నికలపైనే దృష్టిసారిస్తున్న ప్రభుత్వ పెద్దలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
రెవెన్యూ మున్సిపల్ శాఖల ప్రక్షాళన అనేది కేవలం ఉద్యోగులపై కక్ష సాధింపునకేనని ఆయన అన్నారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, పీఆర్‌సీ ఏమైందన్నారు. కొత్త కొలువుల సంగతిని గాలికి వదిలేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోల అనుకూల ఫలితాల కోసమే రోజుకో ప్రకటన అని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటింగ్ సరళి ఉన్నటుల ఆయన చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీయే ఉండాలనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యలోనే పోటీ జరిగినట్లుగానే ఉన్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోటీ చేయాలని, మెజారిటీ జడ్పీ స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా సన్నద్ధం కావాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపోయే దాని కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కేంద్రంలో హంగ్ వస్తే మంత్రిపదవులు పొందవచ్చని కేసీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. ఏ ఇతర పార్టీల సహకారం లేకండానే ఎన్డీయే పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు సాధిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి హన్సరాజ్ అహిర్, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి నేత ఎన్ రామచంద్రరావు, సీనియర్ నేత జీ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...పదాధికారుల సదస్సులో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్