తెలంగాణ

అమరవరంలో 20 కిలోల బంగారు నాణేలు లభ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, ఏప్రిల్ 17: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామంలోని సింగితల వీరారెడ్డి నివాసంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇంటిలో తవ్వుతుండగా 20 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయ. రెండు సంవత్సరాల క్రితం ఇంటి వెనుక భాగంలో తవ్వకాలు చేస్తుండగా బంగారం లభించగా దానిని నాణేలుగా మార్చి ఇంటి గదిలో పూడ్చి పెట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. బంగారం నాణేలను వాటాలు వేసుకుని పంచుకునే విషయంలో పేచీ రావటంతో పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. హుజూర్‌నగర్ పోలీసులు అమరవరం గ్రామం చేరుకుని వీరారెడ్డి ఇంటిలో తవ్విన గుంట నుంచి బయటకు తీసిన బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిపుణులతో రసాయన పరీక్షలు నిర్వహించగా అవి బంగారం కాదని రాగి, ఇత్తడి ముద్దలని పోలీసులు తేల్చారు.
పూజలు.. జంతు బలి
అమరవరం గ్రామంలోని సింగితల వీరారెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి ఆయన భార్యకు ఆరోగ్యం బాగా లేదని ఒక పూజారితో ఇంటిలో పూజలు చేయించినట్లు సమాచారం. పూజల అనంతరం ఆ పూజారినే రాగి, ఇత్తడి ముద్దలను ఇచ్చి నట్టింట్లో గుంట తవ్వి అందులో పూడ్చి పెట్టమని సలహా ఇచ్చారని అంటున్నారు. ఈ విషయమై హుజూర్‌నగర్ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారని.. విచారణ అనంతరం రాగి, ఇత్తడి ముద్దలు వీరారెడ్డి ఇంట్లోకి ఎలా వచ్చింది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.