తెలంగాణ

ఆధ్యాత్మికతతో సర్వ శుభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఏప్రిల్ 17: ప్రతి ఒక్కరూ అధ్యాత్మికత చింతనను అలవరుచుకుంటే ఆత్మ పరిశుద్ధి కలిగి అన్నీ శుభాలే చేకూరుతాయని, ధ్యానంవల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ప్రపంచ గ్లోబల్ గైడ్ హార్ట్‌పుల్ సంస్థ గురుజీ కమ్లేష్ పటేల్ (దాజీ) అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని కృష్ణానది పరీవాహక ప్రాంతమైన శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంలోని మందిర ఆవరణలో పస్పుల సర్పంచ్ దత్తు ఆధ్యర్యంలో ధ్యాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు శాంతి వనం గురూజీతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గురూజీ సభకు హాజరైన వారితో దాదాపు 40 నిమిషాలపాటు ధ్యానం చేయించారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ ధ్యానం మనషిలోని ఏకాగ్రతను పెంచుతుందని అన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రోజువారీ పనులన్నీ పూర్తయ్యాక అరగంటపాటు ధ్యానం చేసినట్లైతే మనసులోని వత్తిడింతా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఏది ప్రారంభించినా ఓ నమ్మకంతో ప్రారంభిస్తే వాటికి సత్ఫలితాలు తప్పకుండా లభిస్తాయని అన్నారు. మనస్సుకు ఇష్టం లేనివి, వదులుకోవాలి అనే విషయాలను, మరచిపోవాలి అనుకునే ప్రత్యేక సంఘటనల గురించి అలోచించకూడదన్నారు. వ్యవస్థలోని మొత్తం మాలిన్యాలను వదిలించుకోవాలి అని సంకల్పించండి కేవలం ప్రక్రియపైనే మనస్సును లగ్నం చేస్తే సత్పలితాలు దివ్యంగా ఉంటాయని సూచించారు. ఈప్రక్రియను నెమ్మదిగా వేగవంతం చేయాలి. సంకల్ప శక్తిని ఉపయోగించి, విశ్వాసంతో పనిచేయాలి. ఇలా రోజూ 20 నుంచి 25 నిమిషాల వరకు చేసిన వారందరికి చక్కటి ఫలితాలు వస్తాయని గురుజీ తెలిపారు. అనంతరం శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం క్షేత్ర సాహిత్యాన్ని శ్రీ రామ ప్రసన్నానంద సరస్వతి మహారాజ్ కమ్మేకర్ పటేల్ గురూజీని శాలువతో సన్మానించగా పస్పుల సర్పంచ్ దత్తులు సాహిత్యాన్ని అందించారు.