తెలంగాణ

దైవశక్తితోనే భారత్‌లో ఐకమత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, జూన్ 18: విభిన్న మతాలకు నిలమైన భారతదేశంలో దైవశక్తితోనే ఐక్యంగా ఉండడంతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని త్రిదండి రామానుజుల చినజీయర్‌స్వామి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల ప్రాంతం అమ్రాబాద్ మండలం బికె లక్ష్మాపురం గ్రామ సమీపంలోని నర్సింహుల వాగు వద్ద వెలసిన పురాతన ఆలయమైన లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, మాజీ మంత్రి రాములు, ఇతర నేతలు, అధికారులతో ఆయన శనివారం పరిశీలించారు. వికాస తరంగణి ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో స్వామివారు గంటపాటు ప్రవచనం చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోని అనేక దేశాలలో ఒకే మతానికి సంబంధించిన ప్రజలు జీవిస్తున్నప్పటికీ వారి మధ్యన ఐక్యత లోపించడంతో విచ్ఛిన్నం అవుతోందని తెలిపారు. మన దేశంలో విభిన్న మతాల ప్రజలు అనేక సాంప్రదాయాలు పాటించే వ్యక్తులు ఉన్నారని వారంతా దైవశక్తితో, సోదరభావంతో మెలుగుతూ దేశ ఐక్యత, అభివృద్ధికి పాల్పడుతున్నారని తెలిపారు. నల్లమల ప్రాంతంలో అల్వారుల వంశస్థులు ఉన్నారని వారి ద్వారానే ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. రామానుజులస్వామి వెయ్యివ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, ఆ కాలంలోనే స్వామివారు దళితుల అభివృద్ధి, ఆలయం ప్రవేశం కోసం అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇక్కడ వెలసిన లక్ష్మినృసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తారని అన్నారు. నేపాల్‌లోని ముక్తి మాదిరి, హిమాలయాలలోని బద్రీనాథ్, మానస సరోవరం లాంటి ప్రదేశాలు చూసిన అనుభూతి నృసింహులస్వామి ప్రాంతం చూసిన తర్వాత కలుగుతుందని అన్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణపుష్కరాలు జరుగనున్నాయని, అదే నెల 19న విజయవాడలో సమతాస్థానం కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ ప్రాంతం నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
రూ.10 లక్షలతో ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే గువ్వల
ప్రకృతి రమనీయత మధ్య వెలసిన లక్ష్మీనృసింహులస్వామి ఆలయ అభివృద్ధికోసం రూ.10 లక్షలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు తెలిపారు. చినజీయర్‌స్వామి ఇక్కడికి రావడం ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమని ఆయన కొనియాడారు. లక్ష్మిపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరు పండుగ వాతావరణం మధ్యన వేడుక జరుపుకున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరయ్యారు. భక్తులందరికీ ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు రమాకాంతాచారి, వికాస తరంగణి రాష్ట్ర కార్యదర్శి భవాని ప్రసాద్, బండారు రాజశేఖర్, ఎంపిపి రామచంద్రమ్మ, సర్పంచు బోడమ్మ, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి. హాజరైన ప్రజలు