తెలంగాణ

భూదానోద్యమానికి ఊపిరి పోసిన వినోభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్ 18: పురపాలక కేంద్రంలో ఆచార్య వినోభా భావే జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆచార్య వినోభా భావే ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి, కాంస్య విగ్రహాలకు భూదాన్ యజ్ఞబోర్డు రాష్ట్ర చైర్మన్ జీ. రాజేందర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వందు ఎకరాల భూదానంతో భూదానోద్యమానికి ఊపిరి పోసి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని కొనియాడారు. దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉద్యమం ఎంతగానో దోహదపడిందని, రాష్ట్రంలో లక్ష 20వేల ఎకరాల భూమిని నిరుపేదలకు అందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యడ నర్సింహ, చింతకింది రమేష్, నోముల గణేష్, ఏషాల మురళి, కర్నాటి అంజమ్మ, భారత భూషన్, నర్సింహ పాల్గొన్నారు.
చిత్రం...వినోభాబావే విగ్రహానికి పూలమాలలు వేస్తున్న రాజేందర్‌రెడ్డి