తెలంగాణ

దేవుడి భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రంలో దేవుడి భూములను ఆక్రమించిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ అనిల్‌కుమార్ హెచ్చరించారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, చాలా ప్రాంతాల్లో దేవాలయాల భూములను కొంతమంది ఆక్రమించుకున్నారన్నారు. దేవుడి భూములను (మాణ్యాలను) ఆక్రమించుకున్న వారు వెంటనే ఈ భూములను వదిలి వేయాలని, సంబంధిత దేవాలయాల పాలక వర్గాలకు అప్పచెప్పాలని సూచించారు. దేవాదాయ శాఖ చేసిన సూచనలను పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో శిక్షనుండి తప్పించుకునేందుకు ఇప్పటికైనా దేవాలయాల భూములను అనుభవిస్తున్న వారు తమ అధీనంలో ఉన్న భూములను ఖాళీ చేసి, దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశించారు.