తెలంగాణ

భూదాన భూములు పేదలకు దక్కేవరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: భూదాన భూము లు పేదలకు దక్కేవరకూ మరోపోరాటం సాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. వేల ఎకరాలు బడాబాబులు, భూకబ్జాదారులు, అక్రమ దారుల గుప్పిట్లో భూదాన భూములు ఉన్నాయని, వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భారత సర్వసేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో 68వ భూదానోద్యమ వార్షికోత్సవ సభ బాలాపూర్‌లోని ఆనంద్ ఫంక్షన్ హాలులో జరిగింది. తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు వెదిరె అరవింద్‌రెడ్డి అధ్యక్షత వహించగా, సీపీఐ హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి ఈటీ నర్సింహ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భూదాన ఉద్యమం ఉద్ధృతం చేయాలని, పేదలకు భూములు దక్కేవరకూ పోరు సాగించాలని చెప్పారు. భూదాన ఉద్యమం చారిత్రాత్మక చరిత్ర ఉందని, ఈ ఉద్యమాన్ని మరువలేమని అన్నారు. ఆచార్య వినోభావే 48 లక్షల ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేశారని చెప్పారు. భూమి ప్రధాన ఏజెంట్‌గా మారిందని , రెట్టింపు ఉత్సాహంతో భూపోరాటం సాగిస్తామని అన్నారు. దునే్నవాడికి భూమి కావాన్న నినాదం నినాదంగానే మిగిలిపోయిందని, ఒకింత ఆందోళనను వెళ్లబుచ్చారు. సహజ వనరులు, సంపద పేదలకు దక్కాలని అన్నారు. భూదాన బోర్డుకు చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నా పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. బోగస్ పట్టాలు సృష్టించి భూదాన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. రెవిన్యూ చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, సమూలంగా మార్చివేయాలని కోరారు. చెరువులు, కుంటలు, భూదాన భూములు, ప్రభుత్వ భూములు బడాబాబులు, రియల్ ఎస్టేట్ చేతుల్లో చిక్కుకున్నాయని , పోరాటాల ద్వారానే భూదాన భూములను కాపాడుకుంటామని అన్నారు. చట్టబద్ధంగా పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. అఖిల భారత సర్వేసేవా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ వినోభావే, వెదిరి రాంచందర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీ నిరంజన్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మాత్రం మారడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ సర్వోదయ మండలి ప్రధానకార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ లక్షా 29వేల 663 ఎకరాల భూదాన భూమి ఉందని అన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 22,250 ఏకరాలు ఉందని, ఆదిభట్లలో 1050 ఎకరాల భూమిని ఇళ్లులేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈటీ నర్సింహ మాట్లాడుతూ భూదాన బోర్డులు పెద్దల చేతుల్లో పెట్టామని, వారంతా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో భూదాన ఉద్యమ సారధి వెదిరె రామచంద్రారెడ్డి తనయుడు వెదిరె ప్రబోధ్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, కావలి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి