తెలంగాణ

అవినీతి రహిత తెలంగాణ నిర్మాణానికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: అవినీతి రహిత తెలంగాణ నిర్మాణానికి తమ మద్దతు ఎపుడూ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని ఇపుడే గుర్తించినట్టు ఆ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేయడానికి సంస్కరణల్లో భాగంగా ఆ శాఖను రద్దుచేసి ఇతర శాఖల్లో విలీనం చేయడానికి పథకం వేస్తోందని అన్నారు. అవినీతి అంటు రోగం వంటిదని, రెవిన్యూ శాఖలోని అంటురోగాన్ని తీసుకువెళ్లిందని, ఇతర శాఖలకు అంటించడంలో ప్రభుత్వం తత్వం ఏమిటో ప్రజలకు బహిరంగంగా తెలపాలని అన్నారు. అవినీతికి రాజకీయ నేతలే కేంద్ర బిందువని, అవినీతిని ఏ రకంగా సీఎం ప్రక్షాళన చేస్తారో చెప్పాలని బోస్ నిలదీశారు.