తెలంగాణ

విచారణ జరిపించాకే అక్రమ కేసులపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: జగిత్యాలలో ఈవీఎంల తరలింపు వివాదంలో మీడియాపై నమోదు చేసిన కేసులపై విచారణ జరిపించాకే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజే) ప్రతినిధి బృందానికి డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. టీయుడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ నేతృత్వంలోయూనియన్ నాయకుల బృందం గురువారం సాయంత్రం డీజీపీని కలిసి జగిత్యాలలో జరిగిన ఉదంతాన్ని వివరించింది. జగిత్యాలలో రాత్రి వేళలో ఈవీఎంలను తరలించే అంశాన్ని వృత్తి ధర్మం మేరకు మీడియా కవర్ చేసిందని వివరించారు. అయితే సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజలను తప్పదోవ పట్టించేలా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్టు యూనియన్ నాయకులు డీజీపీకి వివరించారు. ఈ కేసులపై విచారణ జరిపించి న్యాయం చేయనున్నట్టు డీజీపీ హామీ ఇచ్చినట్టు విరాహత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్రం... డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి జగిత్యాలలో మీడియా ప్రతినిధులపై నమోదు చేసిన తప్పుడు కేసులపై ఎత్తివేయాలని కోరిన టీయుడబ్ల్యుజే బృందం