తెలంగాణ

వయోవృద్ధుల యోగక్షేమాల కోసం ఒన్ బిగ్ ఫ్యామిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: వయోవృద్ధుల యోగ క్షేమాల కోసం దేశంలో తొలిసారిగా వినూత్నంగా వన్ బిగ్ ఫ్యామిలీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు సతీష్ చందర్, ఇనె్వస్టర్ మాధవ్ రెడ్డి యాతం చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటి మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు, నాణ్యమైన జీవితాన్ని అనుభవించేందుకు, తమకు ప్రియమైన వారితో అనుసంధానం అయి ఉండేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందన్నారు. వ్యవస్థాపకులు సతీష్ చందర్ మాట్లాడుతూ యూజర్ ప్రొఫైల్‌ను కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర స్నేహితులతో లింక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నుంచి, ఒన్ బిగ్ ఫ్యామిలీ యాప్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్కచన్నారు. అనుసంధానం అయి ఉన్న వారి కుటుంబ సభ్యులు లేదా వారి స్నేహితులు నుంచి సేవలను పొందవచ్చన్నారు. లొకేషన్ ట్రాకింగ్ సేవలు అందుబాటులో ఉండడం వల్ల ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండవచ్చన్నారు. వినియోగదారులకు చెందిన రవాణా ప్రణాళికలు, మెడికల్ చరిత్రను పంచుకోవచ్చన్నారు. తొలిదశలో ఫ్యామిలీ సేవలను హైదరాబాద్‌లో, రానున్న రోజుల్లో దశల వారీగా బెంగళూరు, ముంబయి, కేరళకు విస్తరించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇండోనేషియా, మలేషియా దేశాలకు విస్తరిస్తామన్నారు. బిల్లులు చెల్లించడం, అత్యవసర సేవలు అందించడంతో పాటు ప్రీమియం సేవలు, రక్షణ, షాపింగ్, వైద్య సేవలను పొందవచ్చన్నారు.