తెలంగాణ

కేటీపీఎస్ 7వ దశలో నిలిచిన 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, ఏప్రిల్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యంతో రూ. 5,500 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో గురువారం రాత్రి బ్రాయిలర్ ట్యూబులు విఫలం కావటంతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాల్వంచలో నిర్మించిన ఈ కర్మాగారంలో విద్యుదుత్పత్తి ప్రారంభమై రాష్ట్రంలోనే తొలి వెలుగులు విరజిమ్మిన 7వ దశలో తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాలుగు నెలల్లోనే నాలుగుసార్లు సాంకేతిక లోపాల కారణంగా కర్మాగారంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్‌గా నిర్మించిన 7వ దశలో యూనిట్ ట్రిప్ కావటం, జనరేటర్‌లో, బ్రాయిలర్ ట్యూబుల్లో సాంకేతిక లోపాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. వేల కోట్లతో నిర్మించిన ఈ కర్మాగారంలో వరుస అవాంతరాలు ఏర్పడుతుండటం కేటీపీఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. కర్మాగారం నిర్మాణ సమయంలోనే కోట్ల రూపాయల విలువైన పరికరాలు నాసిరకానివి అమర్చడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ కర్మాగారంలో తరచూ అవాంతరాలు ఏర్పడి యూనిట్ ట్రిప్ అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి కాలం కావడం, విద్యుత్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ట్రాన్స్‌కోపై భారం పడింది. అధికారులు కర్మాగారంలో ఏర్పడిన సాంకేతిక లోపాలను గుర్తించి మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. 7వ దశ సీఈ సమ్మయ్య ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. శనివారం నాటికి కర్మాగారంలో విద్యుదుత్పత్తి పునఃప్రారంభం అవుతుందని సీఈ వివరించారు.