తెలంగాణ

ఎన్నికల కోడ్‌ను దిక్కరించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడం ఏమిటని వైకాపా సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిలదీశారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తన అనుకూ ల వర్గాల కోసం వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి సంతకాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న చెక్‌లపై అవినీతి కుంభకోణాలు ఉన్నాయన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడే ఆపద్ధర్మ సీఎం అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయవచ్చునని,ప్రస్తుతం ఏపీలో అలాంటి పర్థితులు కన్పించడం లేదన్నారు. ఎన్నికల తాయిలాల కోసం ఖజానాలోని సొమ్ము తరలించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయడం దుర్మార్గం అన్నారు. సాధారణ పరిపాలనలో కనీసం బిల్లులు కూడా మంజారు కాలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.పట్టిసీమ ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పోలవరంపై చంద్రబాబుకు లేదన్నారు. గడచిన ఐదేళ్ళలో ఏపీ పోలీస్ వ్యవస్థను ఏపీ సీఎం భ్రష్టుపట్టించారన్నారు. ప్రతిపక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే తప్పా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన దాఖలు లేవన్నారు. అపద్దాల ప్రచారంతో మే 23వ తేదీ వరకు మరిన్ని సంచలన వార్తలను ప్రజల ముందుకు తీసుకువచ్చానా ఆశ్చర్యపోవాల్సి ఉంటుందన్నారు. తన కళ్ళ ముందు ఓటమి చెందుతున్న వైనాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేడన్నారు. దింపుడు కళ్ళం ఆశలు కూడా టీడీపీకి లేవన్నారు. జనం జగన్మోహనరెడ్డి వైపు నిల్చారన్నారు.