తెలంగాణ

భక్తులతో సలేశ్వరం కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, ఏప్రిల్ 19: ఎతె్తైన కొండల నుంచి జాలువారిన నీటిలో స్నానం చేసి లింగమయ్యను దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు హరించుకొని పోతాయనే నమ్మకంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని సలేశ్వరానికి శుక్రవారం భక్తులు చీమల దండులా కదిలిరావడంతో సలేశ్వరం కొండలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా రద్దీ అధికం కావడంతో ఉత్సవాల నిర్వహణలో ఉన్న చెంచులు సేవలు అందించడంలో చేతులెత్తేసే పరిస్థితులు తలెత్తాయి. దాంతో పుల్లయ్యపల్లి, రాంపూర్ పెంటల వద్ద వాహనాలను పార్కింగ్ చేసి భక్తులను కొండల లోపలికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల వెంట తెచ్చుకున్న నీళ్లు మోకాళ్ల కురువ వరకే ఖాళీ అవుతుండటంతో తాగునీటి కోసం భక్తులు అల్లాడిపోయారు. కొండ దిగాక సలేశ్వరం కొండలలో చెట్లవేర్లనుంచి వచ్చే చల్లని రుచికరమైన నీటిని ఖాళీ సీసాలలో నింపుకొని భక్తులు దాహార్తిని తీర్చుకున్నారు. ఈ వేసవిలో హిమనగరంలో ఉండేలా ఉన్న సలేశ్వరం క్షేత్రంలో పర్యాటకులు ఆ చల్ల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. లింగమయ్య దర్శానికి ఒకటే దారి ఉండటంతో ఇరుకైన కొండ దారులలో నడకన సాగించారు. ఆనవాయితీగా జలపాతం వద్ద స్నానాలు చేసి తడిబట్టలతో దర్శనానికి వెళ్లాల్సి ఉండగా ఈసారి మాత్రం జలపాతం వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందుతూ గుండం వద్ద స్నానం చేసి ఇరుకుగా ఉన్న మెట్లగుండా పిల్లపాపలతో ఓపికగా గంటలు తరబడి నిల్చోని దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ అధికం కావడంతో లోయలో వృద్దులు, మహిళలు, చిన్నారులు గంటల తరబడి వేచి ఉండగా, కొన్ని సందర్భాలలో సొమ్మసిల్లిపోయిన ఘటనలు కూడా కనిపించాయి.
వైద్య సేవలు లేకపోవడంతో భక్తులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంచు పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను ఇచ్చి విభూది అలంకరణ చేశారు. ఆలయం ప్రాంగణంలోని కళ్యాణ కట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రమాదాలు జరగకుండా జాలీలతో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయం దారిపొడవున ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. లోయ ప్రాంతంలో దాతలు అన్నదానం, తాగునీటి సౌకర్యం కల్పించారు. శుక్రవారం సాయంత్రం నుంచి పౌర్ణమి మొదలవుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం కురిసిన వానకు మట్టి రోడ్లు దెబ్బతినడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచి గంటల తరబడి భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.