తెలంగాణ

అవినీతికి మూలం రాజకీయ వ్యవస్థే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 19: మార్పు చట్టాలతో కాదు రాజకీయ వ్యవస్థ విధానంలో మార్పు రావాలని పట్టబద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ లంచం లేనిదే పని జరగదని ఇప్పడికైన సీఎం కు తెలిసివచ్చిన్నందుకు సంతోషమని, గతంలో రెవెన్యూ ఉద్యోగులు బేష్ అన్న సీఎం,ప్రస్తుతం లంచం లేనిదే పనిజరగడం లేదు అంటున్నారని, భూప్రక్షాళనను రెవెన్యూ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వర్తించారని కీతాబ్ ఇచ్చి, నెలరోజుల బోనస్ కూడా చెల్లించారని అన్నారు. కాని ప్రస్తుతం సీఎం దొంగేదొంగ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఈ పాపం నాది కాదు అంటూ అధికారులపై నెడుతున్నారన్నారు. గతంలో హౌజింగ్ డిపార్ట్‌మెంట్‌ను రద్దు చేశారని దీంతో గృహ నిర్మాణ వ్యవస్థ చిన్నభిన్నమైందన్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌శాఖలో అవినీతిలేదా అని, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గతంలో లంచం తీసుకుంటే తప్పెంటని అన్నారని అక్కడి ఎమ్మెల్యే ఎవరని, ఎం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసె చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని,ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయాలని అన్నారు. సమాచార హక్కు చట్టాని నిర్వీర్యాం చేస్తున్నారని, స్వయంప్రతిపత్తి లోకయుక్తను నియామకం లేదన్నారు. చట్టాల మార్పు నేపంతో మరికొన్ని రోజులు ప్రజలు మభ్యపెడతారని పేర్కొన్నారు. భూప్రక్షాళన మార్పు కాద అంటూ ఇప్పడివరకు 54 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు అందించారని ఇంకా 25శాతం పెండింగ్‌లో ఉన్నాయని రైతులకు ఇచ్చిన పాస్‌పుస్తకాల్లో విస్తీర్ణం, వారసత్వం, కొనుగోలులో 50శాతం తప్పులున్నాయని ఇప్పడి వరకు సవరణలు చేయలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగుతున్నారని, ప్రశ్నించే సమయం అసన్నమైందని తెలుసుకున్న సీఎం రెవెన్యూ వ్యవస్థ లో మార్పు అనే దాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. పెద్ద పెద్ద టీఆర్‌ఎస్ నాయకులు భూమిపై అనుభవదారుడు కాకున్న పట్టాలు పొందారని, సీఎం నైతిక భాద్యత కాద అని ప్రభుత్వం అవినీతిలో కూడుకు పొయిందని అధికారంలో కొనసాగే నైతిక హక్కు సీఎంకు లేదు అని అన్నారు. 50వేల కోట్లతో మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లేదని అన్నారు. అవినీతికి మూలం రాజకీయ వ్యవస్థనేనని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేంధర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, నాయకులు గిరినాగభూషణం, మున్నా, పెండెం రాములు, రఘువీర్‌గౌడ్, తదితరులు పాల్గోన్నారు.