తెలంగాణ

రేపు 46 గనుల్లో ఒకేసారి యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: 46 గనులు, 63 విభాగాలు, 25 కాలనీలు, 12 స్టేడియాల్లో ఈనెల 21న ఒకేసారి వేలాది మంది యోగా చేయనున్నారు. కొన్ని వేలమంది కార్మికులు ఒకేసారి యోగా చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఈ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా వేలాదిమందితో యోగా చేయాలని సింగరేణి నిర్ణయించింది. 21న ఉదయం 7.30 నుంచి 8.30 వరకు గంట సేపు యోగా కార్యక్రమం ఉంటుంది. సింగరేణి పరిధిలోని 33 పాఠశాలలు, 8 కాలేజీలు, 7 ఏరియా ఆస్పత్రుల్లో విద్యార్థులు, సిబ్బంది, కార్మికులు అంతా ఒకేసారి యోగా చేస్తారు. ఇక అదే రోజు సాయంత్రం 4 గంటలకు సింగరేణి 11 ఏరియాల్లో 23 కాలనీల్లో ఒకేసారి కార్మికులు, వారి కుటుంబీకులు యోగా చేస్తారు. దాదాపు 40వేల మంది ఒకేసారి యోగా చేస్తారు. ముందస్తుగా కార్మికులకు యోగాలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాస్ యోగ వర్శిటీ కార్యకర్తలను సింగరేణిలోని అన్ని ప్రాంతాలకు పంపించారు. కాలనీల్లో కార్మికులకు, వారి కుటుంబీకులకు ముందుగానే యోగా శిక్షణ ఇవ్వడంతో కాలనీల్లో యోగా వాతావరణం ఏర్పడింది. సింగరేణి చైర్మన్‌గా శ్రీధర్ నియమితులయ్యాక ఆయన చొరవతో సింగరేణి వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.