తెలంగాణ

ఫక్రుద్దీన్ మృతిపై సీపీఐ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసి, ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి నిరంతరం కృషి చేసిన గొప్ప నేత ఫక్రుద్దీన్ అని సీపీఐ, ఏఐటీయూసీ నేతలు శనివారం నాడు కొనియాడారు. శుక్రవారం రాత్రి నగర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఫక్రుద్దీన్ అనారోగ్యంతో ఆయన ఇంట్లో కన్నుమూశారు. హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరిగిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు టీ నరసింహన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో పలు కార్మిక సంఘాలను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. సీపీఐ నేత ఉజ్జిని రత్నాకర్‌రావు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని అన్నారు. ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, కమ్యూనిస్టు నేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సీనియర్ నేత ప్రేమ పావనినీ, జిల్లా కార్యదర్శి టీ నరసింహ, సీపీఐ నేతలు ఆర్ శంకర్ నాయక్, మన్నన్, చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్, శక్త్భియ్, యాదయ్య, మహమూద్ తదితరులు సంతాప సభలో పాల్గొన్నారు.