తెలంగాణ

ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉపాధ్యాయ, విద్యారంగం సమస్యలను ప్రభుత్వం తక్షణణ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తార్నాకలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారని, అవి ఇంత వరకూ అమలుచేయకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులను తక్షణం అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పలు ఉపాధ్యాయ సంఘాల పోరాట నాయకులు జీ సంజీవరావు, ఎం రవీందర్, ఎస్ మల్లయ్య సహా వందలాది టీచర్లు పాల్గొన్నారు.