తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల సాధనకు సమష్టి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఏప్రిల్ 21: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునేందుకు జరిగే పోరాటంలో సమిష్టిగా ముందుకు సాగుదామని అఖిలపక్ష సమావేశంలో వక్తలు తీర్మానించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కులాల జేఏసీ చైర్మన్ గణేష్‌చారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, పీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీఎల్ విశే్వశ్వరరావు, దాస్‌రామ్ నాయక్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎఎల్ మల్లయ్య, బాలమల్లేష్ హాజరై మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు తగినంత రిజర్వేషన్లు అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాల వారికి వారివారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందుతుండగా, బీసీల విషయంలో తీవ్రమైన వివక్ష కొనసాగుతుందని మండిపడ్డారు. అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటూ వారి జెండాలు మోసే వారిగా మాత్రమే చూస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలోని రెండు జాతీయ పార్టీలు అగ్రకులాల చేతుల్లో ఉండటంతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం వారివే కావడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీసీలను పూర్తిస్థాయిలో అణిచివేసే కుట్ర జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపించి బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. బీసీల జనాభా లెక్కలను వెల్లడించకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా రిజర్వేషన్లను తగ్గించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను బహిర్గతంచేసి వాటి ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలు అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. రిజర్వేషన్లు తగ్గింపు వల్ల జిల్లాల వారీగా బీసీలకు జరిగే అన్యాయాన్ని జాజుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీసీ మంత్రులు ఈ విషయంపై స్పందించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల రిజర్వేషన్లు సాధనకు జరిగే పోరాటాలకు కలిసి వస్తామని హామీ ఇచ్చారు.
చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో అభివాదం చేస్తున్న అఖిల పక్ష నేతలు