తెలంగాణ

నష్టాల్లో మామిడి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 21: అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు మార్కెట్ వసతులు లేకపోవడంతో మామిడి రైతులు చతికిల పడుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, అధికంగా కురిసిన మంచు ప్రభావంతో పూత దశలోనే నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గి మామిడి రైతుల ఆశలపై నీరు చల్లింది. చలి తీవ్రతతో దాదాపు 80 శాతం పూతం రాలడంతో కాయల సంఖ్య తగ్గింది. కొన్ని చెట్లకు ఒక్క కాయ కూడా లేకుండా పోయందంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతోంది. భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం పట్టడంతో బోర్లు ఎండిపోయి నీరు చాలక రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిమ్మ, బత్తాయి సాగు తర్వాత రైతులు మామిడి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రకృతి నమ్ముకుని మామిడి తోటలను పెంచుతున్న రైతులు డిసెంబర్ నెలలో పూత ప్రారంభమయ్యే దశలో అధిక చలి ప్రభావంతో ప్రతికూల మార్పులు చోటు చేసుకుని పూత రాలిపోయింది. ఉమ్మడి జిల్లాలో 15వేల 667హెక్టార్‌ల విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. నల్లగొండ జిల్లాలో 3వేల 12హెకార్లలో, సూర్యాపేట జిల్లాలో 6వేల 857హెకార్లలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5వేల 798హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కోదాడ, అడ్డగూడూరు, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎస్), భువనగిరి, నూతనకల్, సూర్యాపేట, నల్లగొండ, త్రిపురారం, నాంపల్లి, నకిరేకల్, కట్టంగూర్, తదితర మండలాల్లో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో 80శాతంకంటే తక్కువ మాత్రమే మామిడి కాయలు చెట్లపై ఉన్నాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలు సాగు చేస్తే వాతావరణం పరిస్థితలు అనుకూలించకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పిందె పడిన దగ్గర నుండి కంటికి రెప్పలా కాపాడినప్పటికీ గిట్టుబాటు ధర రాక దిగాలు చెందుతున్నారు. అదే విధంగా అకాల వర్షాలు, ఈదురు గాళులతో కాయలు రాలి నష్టాన్ని చవి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మార్కెట్ వసతి లేకపోవడంతో దూర ప్రాంతాలకు తీసుకెళ్లలేక ప్రైవేట్ వ్యాపారులు, మార్కెట్లకు, దళారులకు విక్రయించి మరింత నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండల కేంద్రాలకు నల్లగొండ జిల్లా రైతులతో పాటు ఖమ్మం, వరంగల్, తదితర ప్రాంతాల నుండి రైతులు మామిడి కాయలు తీసుకురాగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు, కమీషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. కనీసం లైసెన్సులు లేకుండా లక్షలు ఘడిస్తున్నా పర్యవేక్షణ చేసేవారే కరువయ్యారు. ఏది ఏమైనా ప్రతి ఏట మార్కెట్ లేకపోవడంతో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు.