తెలంగాణ

బి జె పి గెలుపు.. ఓటముల దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి తెలంగాణ శాఖ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. గ్రాడ్యుయేట్ల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది, టిఆర్‌ఎస్‌ను కంగుతినిపించింది. అయతే వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో చతికిలబడింది.

ఈ ఏడాది బిజెపి తెలంగాణ శాఖకు కొంత చేదు, కొంత తీపి మిగిలింది. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపి భాగస్వామిగా చేరింది. ఇది అంతకుముందు ఏడాదే జరిగినందున ఈ ఏడాది అక్కడ పార్టీ బలోపేతానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే బిజెపి రాష్ట్ర శాఖ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. గ్రాడ్యుయేట్ల కోటాలో శాసనమండలికి (కౌన్సిల్) జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి ఎన్. రామచందర్ రావు భారీ మెజారిటీతో గెలుపొంది, టిఆర్‌ఎస్‌ను కంగుతినిపించారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి రాంమోహన్ రావు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలువగలిగారు. ఎర్రబెల్లి ఓటమికి పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపమే కారణమన్న విమర్శలు వచ్చాయి. రాంచందర్ రావు గెలుపొందడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతున్నదని, ఈ హవా ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో తడాఖా చూపించవచ్చని ఆ పార్టీ నాయకులు ఊహించారు. ఎన్నో కలలు కన్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నాయకులు ముందుకు వచ్చినా, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పిదం చేసింది. ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్యను రంగంలోకి దించింది. పార్టీలో ఏనాడూ పని చేయని వ్యక్తి, అమెరికాలో స్థిరపడి డాక్టర్‌గా వృత్తిలో ఉన్న దేవయ్యకు టిక్కెట్ ఎలా ఇస్తారని అసంతృప్తులు ఆరంభమయ్యాయి. అది ఎన్నికలపై ప్రభావం చూపించింది. దేవయ్యకు డిపాజిట్ కూడా దక్కక పోవడంతో పార్టీ అవాక్కయంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పని తీరు పట్ల సహచర ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. కిషన్‌రెడ్డి వల్లే పార్టీ బలోపేతం కావడం లేదని, పార్టీలో గ్రూపులుగా చేసి ఎవరినీ ఎదగకుండా చేస్తున్నారని ఆరోపించడం తీవ్ర దుమారం చెలరేగింది. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో అనేక మంది నాయకులు అంతర్గతంగా ఏకీభవించారు. క్రమశిక్షణకు మారు పేరైన బిజెపిలో ఒక ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని కోరలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, మిత్రపక్షమైన టిడిపితో మరింత సయోధ్యతో సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉందని బిజెపి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

- వి.ఈశ్వర్ రెడ్డి