తెలంగాణ

ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వాసితులకు న్యాయం చేయండి ఎకరాకు 8 లక్షలు పరిహారమివ్వాలి లేదా ప్రత్యామ్నాయ భూమి కేటాయంచండి
మల్లన్నసాగర్ నిర్వాసితుల డిమాండ్ సమస్యపై ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు 48గంటలు దీక్ష చేస్తా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్/ చౌటుప్పల్, జూన్ 20: ‘మేం మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. నిర్వాసితులకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నాం’ అని ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్య కార్యచరణ సమితి స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏటిగడ్డ కిష్టాపురం, పరిసర గ్రామాల నిర్వాసితులు మాట్లాడారు. ఎకరాకు 8 లక్షల పరిహారం చెల్లించాలని లేదా మరోచోట సమాన భూమి ఇవ్వాలని కోరారు. ఉన్న ఊరు వదిలి వెళ్లడం ఎంతకష్టమో ప్రభుత్వం గ్రహించాలని కోరారు. ఈ విషయంలో తెరాస నేతలు బెదిరిస్తున్నారని, తమ సమస్యలపై సిఎం స్పందించకుంటే కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని పలువురు ఆవేశంగా హెచ్చరించారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకమన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేయడం తగదంటూనే, ముంపు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని కోరితే ప్రాజెక్టును అడ్డుకున్నట్టు అవుతుందా? అంటూ నిలదీశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల తమ గ్రామాలు మునిగిపోతాయని తెలిసినప్పటి నుంచి గ్రామంలో తమ సమస్యల ఎలా ఉన్నాయో చెబుతూ కొందరు మహిళా రైతులు కంటతడి పెట్టారు. సమస్యపై హైకోర్టు సిజె, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. బెదిరించి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని తమ ఫిర్యాదులో కోరినట్టు రైతులు తెలిపారు. ముంపు గ్రామాల రైతులు నిర్వహించిన సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షుడు సాగర్, నాలుగు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పేరిట మా గ్రామాలను, భూములను, ఇళ్లను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా నిలిపివేసే చర్యలు తీసుకోవాలని కోరుతూ మల్లన్నసాగర్ నిర్వాసిత బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
48 గంటలు దీక్ష చేస్తా: రేవంత్
ముంపు బాధితులకు మద్దతుగా ఏటిగడ్డ కిష్టాపురంలో 48 గంటల దీక్ష చేపడతానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ముంపు బాధితుకు న్యాయం జరిగే వరకూ తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల కోసం భూములు వదులుకోవాలంటున్న సిఎం, తన ఫాంహౌస్ వదులుకుంటారా? అని ప్రశ్నించారు. అందుకు కెసిఆర్ సిద్ధపడితే, తానే స్వయంగా ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 250 ఎకరాలకు రూ.25 కోట్లు డిడి రూపంలో 48 గంటల్లో అందిస్తానన్నారు. అందులోనే గడీలు నిర్మించుకునేందుకు కేసిఆర్‌కు ఐదు ఎకరాల భూమి కేటాయించి, మిగిలిన 245 ఎకరాలను మల్లన్నసాగర్ బాధితులకు పంపిణీ చేస్తామన్నారు. ముంపు బాధితులకు ఏమిస్తారో సిఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలతో చర్చిద్దాం. ఏంకావాలో అడుగుదాం. న్యాయం చేసి ఒప్పించి మల్లన్నసాగర్‌ను నిర్మించుకుందామని రేవంత్‌రెడ్డి సూచించారు.