తెలంగాణ

విద్యా మంత్రి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్య త వహిస్తూ విద్యా మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ ప్రధానకార్యదర్శి బోయినపల్లి రాము డిమాండ్ చేశారు. మరో పక్క గ్లోబ ల్ ఎరీనా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ వద్ద సీపీఐ నేతలు బుధవారం నాడు ధర్నా నిర్వహించారు. ఎలాంటి అర్హతలు లేకున్నా ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని , చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా వెనుకేసుకు రావడం విడ్డూరమని బోయినపల్లి రాము అన్నారు. ఉన్నవన్నీ విద్యార్థుల అపోహలేనని విద్యార్ధులను హేళన చేస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే కనుక వీరకి ఏ మాత్రం పేద విద్యార్థులపై ప్రేమ ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేసిన పీడీఎస్‌యూ నేతలను పోలీసులు అరెస్టుచేశారు.
న్యాయం చేయాలి: ఐద్వా
విద్యార్ధుల మరణానికి కారణమైన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేయాలని, ఉన్నత విద్యాశాఖా మంత్రి జగదీష్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లనే ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే 25వేల మంది విద్యార్థులకు సున్నా మార్కులు, 16 మంది ఆత్మహత్యలకు కారణమైందన్నారు. నిజాలు బయటకు రావాలంటే సి ట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, బోర్డు కార్యదర్శిని బర్త్ఫ్ చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.