తెలంగాణ

ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల ఫెయిల్ అయిన విద్యార్థులు సమాచార హక్కు చట్టం సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్‌రావు కోరారు. సెక్షన్ 7(1) ప్రకారం ప్రాణ హానికి , వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే సమాచారాన్ని 48 గంటల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు.పది రూపాయలు రుసుము చెల్లించి విద్యార్థులు, వారి తల్లితండ్రులు సమాచార హక్కు చట్టం కింద జవాబు పత్రాలను కావాలని దరఖాస్తు చేయాలన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల ఫెయిల్ అయిన విద్యార్థులు అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తద్వారా విద్యార్థులు జీవించే హక్కును కోల్పోతున్నారన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా చేయాలని, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఏజన్సీపై అదికారులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.