తెలంగాణ

జతకలిసే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: వ్యాపార వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి చైనాలోని హైనన్ ప్రావిన్స్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది. ఐటి మంత్రి కె తారక రామారావు సమక్షంలో కుదిరిన ఒప్పందంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలంగాణ తరఫున, హైనన్ గవర్నర్ లియుసిగుయ్ హైనన్ తరఫున సంతకాలు చేశారు. ఐటి పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయ. అలాగే హెనన్ ప్రావిన్స్‌లో అపోలో ఆస్పత్రి నిర్మాణం, టి-హబ్‌కు సహకారంపైనా ఒప్పందం కుదిరింది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను హైనన్ ప్రతినిధులకు ఐటి మంత్రి కెటిఆర్ వివరించారు.
ఐటి రంగంలో పరస్పరం సహకరించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై చైనా భాషలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా చైనా ప్రతినిధుల కోసం ప్రదర్శించారు. హైనన్ ప్రావిన్స్ ప్రతినిధులు తమ రాష్ట్రానికి రావాలని ఐటి మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. నవంబర్‌లో చైనాలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని కెటిఆర్‌ను ఆహ్వానించారు. చైనా సందర్శనలో తప్పకుండా హైనన్ నగరానికి వస్తానని కెటిఆర్ తెలిపారు.