తెలంగాణ

మేడేకు ‘కోడ్’ అడ్డు చెప్పొద్దు: సీఐటీయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వ అధికారులు మేడే సన్నాహాలకు అడ్డుపడటం సరికాదని సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం పేర్కొంది. ప్రతి ఏటా మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవానికి ఎన్నికల కోడ్ పేరుతో జిల్లా అధికార యంత్రాంగం ఆటంక పర్చకుండా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం సాయిబాబు పేర్కొన్నారు. రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఉద్యోగులు, కార్మికులు , కష్టజీవులంతా మే డే కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను సీఐటీయూ ప్రతినిధి బృందం రెండు సార్లు కలిసి ఈ అంశాన్ని చర్చించిందని, సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.