తెలంగాణ

పరిషత్ రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యుల రెండో దశ ఎన్నికల కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతోంది. రెండో దశలో 180 జడ్పీటీసీల స్థానాలకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ (పట్టణ) జిల్లాల్లో రెండు దశల్లోనే ఎన్నికలు పూర్తవుతాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతున్నాయి. మిగతా 27 జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. పరిషత్ ఎన్నికలకు సంబంధించి తొలిదశ నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతుండగానే, రెండోదశ నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమవుతోంది. శుక్రవారం ఉదయం 10.30 కు నోటీస్ జారీ కాగానే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 29 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అర్హతలేని నామినేషన్లు ఏవైనా ఉంటే రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తారు. 29 సాయంత్రం 5 గంటలకు అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఏవైనా నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తే, వాటిపై సంబంధిత అభ్యర్థులు ఏప్రిల్ 30 లోగా అప్పీల్ చేసుకోవచ్చు. ఎంపీటీసీలకు సంబంధించిన అప్పీళ్లను ఆర్డీఓలకు, జడ్పీటీసీలకు సంబంధించిన అప్పీళ్లను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. మే 1 న వీటిపై చర్యలు తీసుకుంటారు. మే 2 న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకోసం గడువుగా నిర్ణయించారు. రెండోతేదీ సాయంత్రమే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 2019 మే 10 న ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 27 న ఓట్ల లెక్కింపుచేస్తారని ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకే ప్రకటించింది.