తెలంగాణ

స్టార్ క్యాంపెయినర్ల వాహనాలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహిస్తుండటంతో ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల వాహనాలు తిరిగేందుకు రాష్టస్థ్రాయిలో అనుమతి ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి (ఎస్‌ఈసీ) ఎం. అశోక్ కుమార్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంచాయతీరాజ్ కమిషనర్ ఇందుకోసం అనుమతించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులకు పరిధి చిన్నగా ఉండటంతో వారికి ఆర్డీఓలు అనుమతి ఇచ్చేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారు కాబట్టి, ప్రతి ఆర్డీఓ నుండి అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని వివరించారు. రాష్టస్థ్రాయిలో వాహనాల్లో తిరిగేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ అనుమతి ఇవ్వవచ్చని సూచించారు. అనుమతికి సంబంధించి చతురస్రంగా ఉండే స్టిక్కర్‌ను రూపొందించాలని, దాన్ని వాహనాల ముందుభాగంలో ఉండే అద్దంపై అతికించాలని సూచించారు. ఒరిజినల్ అనుమతి పత్రం వాహనాల్లో ఉంటుందని, పోలీసులు కాని ఇతర అధికారులను తనిఖీ చేసినప్పుడు ఒరిజినల్ అనుమతి పత్రం చూపించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చే అనుమతికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సిబ్బంది అందరికీ తెలియచేయాలని ఆదేశించారు.