తెలంగాణ

వడదెబ్బకు ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, దండేపల్లి, మే 15 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. ఉట్నూరు మండలం లక్కారం పంచాయతీ పరిధిలోని వేణునగర్‌కు చెందిన కుర్సింగ కౌసల్య బాయి (62) వడ దెబ్బకు గురై అస్వస్థతకు గురి కాగా, ఆమె కుమారుడు భూమన్న ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని టీఆర్‌ఎస్ నాయకుడు జావిద్ హన్సారి, తదితరులు పరామర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దర్మారావుపేట గ్రామానికి చెందిన కొల్లూరి బుచ్చమ్మ (55) అనే ఉపాధి హామీ కూలీ వడదెబ్బ సోకి బుధవారం మృతిచెందింది. బుచ్చమ్మ సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లింది. పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మేదరిపేటలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.