తెలంగాణ

దశ మారనున్న అలంపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, జూన్ 23: అష్టాదశ శక్తిపీఠమైన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారు తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారమని అందుకే ఇక్కడ రైల్వేహాల్ట్ స్టేషన్‌గా మార్పు చెందిందని, అలంపూర్ దశ, దిశ మారుతోందని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఎపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. గురువారం జోగులాంబ రైల్వేస్టేషన్ శంకుస్థాపన జరిగింది. ముందుగా మొక్కలను నాటి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి నంది ఎల్లయ్య మాట్లాడుతూ జోగులాంబ రైల్వేస్టేషన్‌ను అందరం కలిసి అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే గద్వాల-మాచర్ల రైల్వేమార్గం పనులకు రూ.90 కోట్లు అవసరముందని, వాటికి నిధులు విడుదల చేసి త్వరగా పనులు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేటకు రైలు మార్గం పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ చూపాలని ఆయన కోరారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ జోగులాంబ రైల్వేస్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నాలుగు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, ఇప్పుడు స్టేషన్‌గా మార్పు చెందింది కనుక అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు రైల్వే అధికారులు కృషి చేయాలని కోరారు. రైల్వేస్టేషన్ నుంచి అలంపూర్ ఆలయం వరకు బస్సు సౌకర్యం కూడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే డిఆర్‌ఎం అరుణసింగ్ మాట్లాడుతూ జోగులాంబ స్టేషన్‌లో రూ.27.95 లక్షలతో టికెట్ కౌంటర్, విశ్రాంత గది, మరుగుదొడ్లు, మూత్రశాలల గదులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ జోగులాంబ రైల్వేహాల్ట్ 2006లో ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని స్టేషన్‌గా మార్పుచెందిందని, మానవపాడు, ఇటిక్యాల రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు సహకరించాలని కోరారు.

చిత్రం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపిలు నంది ఎల్లయ్య, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రైల్వే డిఆర్‌ఎం అరుణసింగ్