తెలంగాణ

ఇక పోలియో భయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: అంతరించి పోయిందనుకున్న పోలియో వైరస్ భయటపడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. అంబర్‌పేటలో పోలియో వైరస్ వైరస్ వ్యాక్సినేటెడ్ డిరైవ్డ్ పోలియో వైరస్- టైప్ 2 నిర్మూలన వంద శాతం జరుగుతోందని, నిర్ణీత పోలియో కేంద్రాలు అన్నింటిలో వ్యాక్సినేషన్ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. నగరంలోని పలు ఆరోగ్య కేంద్రాలను మంత్రి గురువారం పరిశీలించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 12 క్లస్టర్లను గుర్తించి,825 పోలియో కేంద్రాల ద్వారా పోలియో వ్యాక్సినేషన్ జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 70,584 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేయగా, రెండవ రోజు 65, 289 మంది పిల్లలకు టీకాలు ఇచ్చారు. మూడవ రోజు 52,625 మందికి టీకాలు ఇచ్చారు.